KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు..

KTR: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.

Update: 2023-03-30 13:45 GMT

KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు..

KTR: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ ప్రాధాన్యతలో అసలు తెలంగాణ లేనప్పుడు.. రాష్ట్ర ప్రజల ప్రాధాన్యతలో మాత్రం బీజేపీ పార్టీ ఎందుకుండాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ ఇచ్చేది లేదని మోడీ సర్కారు తేల్చి చెప్పిందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని మోడీ చెప్పారు. మెట్రో రెండో దశ, ITIR, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చేశారు.

రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను మోడీ అమలు చేయట్లేదన్నారు కేటీఆర్. వీటన్నింటికీ రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు కానీ, ప్రధాని రాష్ట్రమైన గుజరాత్‌కు లోకోమోటివ్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి 20వేల కోట్ల రూపాయలు ఇచ్చారని కేటీఆర్‌ అన్నారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితమిది అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News