Minister KTR: బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి

Minister KTR: కేంద్రంపై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

Update: 2022-09-02 15:30 GMT

Minister KTR: బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి

Minister KTR: కేంద్రంపై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు మోడీ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చిందన్నారు. రాష్ట్రంపై వివక్షతో దేశ ప్రయోజనాలను కేంద్రం తాకట్టు పెడుతుందన్నారు. బల్క్ డ్రగ్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటి అత్యంత అనుకూలమన్నారు. భూ సేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉన్న ఫార్మాసిటిని కేంద్రం కావాలనే విస్మరిస్తోందని విమర్శలు గుప్పించారు.

మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటు అత్యవసరమని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్తగా బల్క్ డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయాలంటే మూడేళ్లు పడుతుందని అన్ని సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటిని పరిగణలోకి తీసుకోకపోవడం కేంద్రానికి ఉన్న నిబద్దతను తెలియచేస్తుందన్నారు. వెంటనే తెలంగాణ బల్క్ డ్రగ్‌ పార్కును కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.

Tags:    

Similar News