Kamareddy Farmers: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనను రద్దు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ

Kamareddy Farmers: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌‌పై క్లారిటీ వచ్చింది.

Update: 2023-10-28 11:30 GMT

Kamareddy Farmers: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనను రద్దు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ

Kamareddy Farmers: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌‌పై క్లారిటీ వచ్చింది. మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కామారెడ్డి రైతు జేఏసీ మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా..రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు మంత్రి. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తివేసే చర్యలు తీసుకుంటామన్నారు కేటీఆర్. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకుని రాష్ట్ర డిజిపితో మాట్లాడారు.

Tags:    

Similar News