Hyderabad: హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్

Hyderabad: బాలానగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ * 2017 ఆగస్టు 21న నిర్మాణ పనులకు శంకుస్థాపన

Update: 2021-07-06 01:49 GMT
బాలానగర్ కొత్త ఫ్లైఓవర్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బాలానగర్‌ ఫ్లైఓవర్ రెడీ అయ్యింది. ఇవాళ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్‌ చౌరస్తా రద్దీగా ఉంటుంది. కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, జీడిమెట్ల వెళ్లే దారిలో హేవీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. ఈ ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.

2017 ఆగస్టు 21న బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు 385 కోట్లు వెచ్చించి నాలుగేళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేశారు. 1.13 కిలోమీటర్ పొడవున్న ఈ ఫ్లైఓవర్‌ని 24మీటర్ల వెడల్పు, 26పిల్లర్లతో నిర్మించారు. దీనికి బాబూ జగ్జీవన్‌రామ్‌ బ్రిడ్జిగా నామకరణం చేశారు.

బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను మరికాసేపట్లో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచక పూర్తయ్యాయి. ఇక ఇవ్వాల్టీ నుంచి ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. దీంతో స్థానికులు అటుగా వెళ్లే వాహనదారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.  

Full View


Tags:    

Similar News