దుబ్బాకలో గెలుపు కోసం బీజేపీ కుట్రలు చేస్తోంది : కేటీఆర్‌

బీజేపీ తీరుపై మంత్రి కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో గెలుపు కోసం కమళనాథులు చిల్లరమల్లర డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2020-11-01 11:31 GMT

బీజేపీ తీరుపై మంత్రి కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో గెలుపు కోసం కమళనాథులు చిల్లరమల్లర డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కట్టలతో బీజేపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్న కేటీఆర్‌.. తమపార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిగితే ఒక్క రూపాయి కూడా పట్టుబడలేదన్నారు. ఇక బీజేపీ కుట్రలపై ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అటు దుబ్బాక ఉపఎన్నికను టీఆర్‌ఎస్‌ ప్రతీష్టాత్మంగా తీసుకుంది. అన్నీ తానై మంత్రి హరీష్‌రావు హోరాహోరీగా ప్రచారం చేశారు. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రామలింగారెడ్డికి చెందిన సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంది.

టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యలతో ఆగస్టు నెలలో మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి.. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్ధులను కూడా ప్రకటించాయి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటిలో ఉన్నారు.ఇక నవంబర్ 3 న ఎన్నికలు జరగగా 10 న ఫలితాలు రానున్నాయి.

ఇక గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు.

Tags:    

Similar News