Konda Surekha: తెలంగాణ స్టేట్ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆఫీస్‌లో మంత్రి కొండా సురేఖ

Konda Surekha: ఇష్టారీతిన వ్యవహరించే వారిపై చర్యలుంటాయని ఆగ్రహం

Update: 2024-01-29 15:15 GMT

Konda Surekha: తెలంగాణ స్టేట్ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆఫీస్‌లో మంత్రి కొండా సురేఖ

Konda Surekha: హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాన్ని మంత్రి కొండా సురేఖ ఆకస్మికగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి సెక్షన్‌లో కలియతిరిగి ఫైళ్లను పరిశీలించారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆఫీస్‌లో ఎంతమంది పనిచేస్తున్నారు.., ఎవరెవరు లీవ్‌లో ఉన్నారో అగిడి తెలుసుకున్నారామె. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిన వ్యవహరించే వారిపై కఠిన చర్యలుంటాయని మంత్రి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు.

కాలుష్య నివారణ, నియంత్రణకు బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న పరిశోధనలు, చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదని, సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలను అమలుపరచాలని ఆదేశించారు. భవిష్యత్‌లో తాను ఎప్పుడు తనిఖీ నిర్వహించినా అధికారులు, సిబ్బంది అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని మంత్రి సురేఖ సూచించారు.

Tags:    

Similar News