Minister Jupally: కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
Minister Jupally: కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
Minister Jupally: కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
Minister Jupally: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.... కేసీఆర్ ప్రభుత్వంలో సొమ్మొకడిది సోకొకడిది అన్నారు.
రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. దేశ చరిత్రలోనే సెక్రటేరియట్ కు పోనటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్పుడు మాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చేస్తున్నారని విమర్శించారు.