Jagdish Reddy: క్యాన్సర్ సోకిన బాధితురాలికి అండగా నిలిచిన మంత్రి జగదీశ్‌రెడ్డి..
Jagdish Reddy: గత 9 ఏళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న యువతి స్వాతి
Jagdish Reddy: క్యాన్సర్ సోకిన బాధితురాలికి అండగా నిలిచిన మంత్రి జగదీశ్‌రెడ్డి..
Jagdish Reddy: క్యాన్సర్ సోకిన ఓ బాధితురాలికి అండగా నిలిచారు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చివ్వేం మండలం జగన్ తండాకు చెందిన ధరావత్ చాంప్ల-భూభా దంపతుల కుమార్తె స్వాతి గత 9 ఏళ్లుగా అనారోగ్యంబారిన పడి క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. అయితే విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. స్వయంగా వారినే తన ఇంటికి పిలిపించుకున్న మంత్రి జగదీశ్..వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి హామీనిచ్చారు. అయితే తనకు ఒక్కసారి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని బాధితురాలు చెప్పడంతో...వెంటనే స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి..ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు ఫోన్ చేసి..బాధితురాలికి అండగా నిలవాలని ఆదేశించారు.