అడవుల శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు ఏ దేశంలోనూ, ఏ రాష్ల్రంలోనూ రాకూడదని తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

Update: 2019-11-30 11:14 GMT
అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు ఏ దేశంలోనూ, ఏ రాష్ల్రంలోనూ రాకూడదని తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో శనివారం జరుగుతున్న అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో 24 శాతానికి తగ్గిపోయిన అడవులను 33 శాతానికి పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ దశల వారీగా 1.175 కోట్ల మొక్కలను నాటామని ఆయన తెలిపారు. అంతే కాక అటవీ శాఖలో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చాక భూగర్భ జలాలు, అడవులు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అంతేకాక వాతావరణాన్ని కాపాడాలంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించి జూట్, పేపర్ బాగ్స్ ను వినియోగించాలని ఆయన తెలిపారు.

ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉందని దాన్ని తగ్గించేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఇంద్రకరణ్‌ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అధ్యక్షతన 'దేశంలో పర్యావరణ పరిరక్షణ-అడవుల రక్షణ మొక్కల పెంపకం'పై సమీక్ష జరగనుందని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయనతెలిపారు.   

Tags:    

Similar News