Harish Rao: సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన
Harish Rao: బడంపేట్ రాచన్నస్వామి ఆలయంలో హరీష్‌రావు ప్రత్యేక పూజలు
Harish Rao: సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన
Harish Rao: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేట్ రాచన్నస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ పాలక మండలి మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, జెడ్పీ ఛైర్‌పర్సన్ మంజుశ్రీతో కలిసి మంత్రి భద్రకాళి సమేత రాచన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు బహుకరించాయి. ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ధర్మకర్తల మండలి కోరగా సానుకూలంగా స్పందించారు.