Minister Harish Rao Congratulates: సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డకు మంత్రి హరీశ్ రావు అభినందనలు

Update: 2020-08-04 10:17 GMT

minister harish rao congratulates: ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ 2019కి సంబంధించిన తుది‌ ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలంగాణ యువకుడు తన సత్తా చాటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్‌ ఆలిండియా 110 ర్యాంక్‌ సాధించాడు. మకరంద్ ను ట్విట్టర్ ద్వారా ఆర్థిక శాక మంత్రి హరీశ్‌ రావు అభినందించారు. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్దిక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపాడంటూ మకరంద్ ను అభినందించారు. మకరంద్ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామం. మకరంద్ తల్లిదండ్రులు నిర్మల, సురేశ్ నాలుగు దశాబ్దాల కిందట సిద్ధిపేటలో స్థిరపడ్డారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ 2019కి సంబంధించిన తుది‌ ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. 2019 సెప్టెంబ‌ర్‌లో మెయిన్స్ ప‌రీక్షలు జ‌రుగ‌గా 2020 ఫిబ్ర‌వ‌రి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు. ఇంట‌ర్వ్యూలో నెగ్గి మొత్తం 829 మంది అభ్యర్థులు సివిల్‌ స‌ర్వీసుల‌కు ఎంపికైన‌ట్లు యూపీఎస్సీ తెలిపింది. ఇందులో 304 మంది జనరల్‌, 78 మంది ఈబీసీ, 254 మంది ఓబీసీ, 129 ఎస్సీ, 67 మండి ఎస్టీ అభ్యర్ధులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్‌ మొదటి ర్యాంక్‌, జతిన్‌ కిషోర్‌ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్‌ సాధించారు. అభ్య‌ర్థులు త‌మ వెబ్‌సైట్లో ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చ‌ని యూపీఎస్సీ స్ప‌ష్టం చేసింది.



 


Tags:    

Similar News