కాంగ్రెస్‌, బీజేపీ ఎండమావులు వంటివి.. వారి వెంట వెళ్తే ఏమీరాదు : హరీష్ రావు

Harish Rao In Dubbaka : కాంగ్రెస్, బీజేపీ నాయకుల పైన ఫైర్ అయ్యారు సిద్ధిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.. వానాకాలంలో ఉసిళ్లు వచ్చినట్లు వాళ్ళు వస్తారని, కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రజలకి ఎప్పటికి అందుబాటులో ఉంటుందని అన్నారు.

Update: 2020-10-17 11:57 GMT

Harish Rao In Dubbaka : కాంగ్రెస్, బీజేపీ నాయకుల పైన ఫైర్ అయ్యారు సిద్ధిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.. వానాకాలంలో ఉసిళ్లు వచ్చినట్లు వాళ్ళు వస్తారని, కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రజలకి ఎప్పటికి అందుబాటులో ఉంటుందని అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని ముబారస్‌పూర్‌లో ప్రసగించిన హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పడు రైతులకి విద్యుత్‌ ఇవ్వకుండా ఇబ్బందులకి గురి చేస్తే, అటు బీజేపీ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టి తిప్పలు పెడుతుందని అన్నారు. ఈ రెండు పార్టీలు ఎండమావులు వంటివని.. వారి వెంటవెళ్తే ఏమీరాదని హరీష్ రావు ఎద్దేవా చేశారు.. ఇక కరోనా లాంటి విపత్కర మైన సమయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసిందని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేసారు.

ఇక ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యలతో ఆగస్టు నెలలో మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి.. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్ధులను కూడా ప్రకటించాయి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటిలో ఉన్నారు.ఇక నవంబర్ 3 న ఎన్నికలు జరగగా 10 న ఫలితాలు రానున్నాయి.

ఇక గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు.

Tags:    

Similar News