Harish Rao: ప్రజారోగ్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం

Harish Rao: కూకట్‌పల్లిలో వంద పడకల ఆస్పత్రికి హరీశ్ రావు భూమి పూజ

Update: 2023-06-11 03:47 GMT

Harish Rao: ప్రజారోగ్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం

Harish Rao: ప్రజారోగ్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆరోగ్య, వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ఐదోఫేజులో వంద పడకల ఆస్పత్రికి ఆయన భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాక ముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న తీరుకి, తెలంగాణ సాధించిన తర్వాత సర్కారు ఆస్పత్రుల్లో పెరిగిన సుఖ ప్రసవాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. 9 ఏళ్లల్లో 12 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 14 తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుకోసం వచ్చేవారికి పౌష్టికాహారం ఇస్తామన్నారు. పుట్టబోయే బిడ్డనుంచి చావుదాకా ప్రజలకు ఏం కావాలోనని ఆలోచించేనాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News