Minister Etela Rajender Review on corona: కరోనా చికిత్సకు మందుల కొరత రానివ్వొద్దు: మంత్రి ఈటల

Minister Etela Rajender Review on corona: రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ వేల మందిని ఆస్పత్రులపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులతో ఇప్పటివరకు ఎన్నో సమీక్షలు నిర్వహించారు.

Update: 2020-07-18 10:21 GMT
etela rajender

Minister Etela Rajender Review on corona: రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ వేల మందిని ఆస్పత్రులపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులతో ఇప్పటివరకు ఎన్నో సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశాల్లో కరోనా మహమ్మారి బారిన పడిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, వైరస్ బారిన పడిన బాధితులకు అందించే వైద్యం గురించి విస్తృత స్ధాయిలో చర్చలు జరిపారు.

ఇదే కోణంలో మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో మందుల కొరతపై సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కరోనా చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరాపై చర్చించారు. విటమిన్‌-డీ, సీ, మల్టీవిటమిన్‌, జింక్‌ వంటి ఔషధాలను మందుల దుకాణాలు, దవాఖానల్లో సరిపడినన్ని ఉంచాలని చెప్పారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే డాక్సామెతాసోన్‌, మిథైల్‌ ప్రెడ్నిసోలొన్‌, అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌ మందులను వీలైనంత తొందరగా సరఫరా చేయాలని సూచించారు.

కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్పించి బయటికి రావొద్దని సూచించారు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. బయటికి వచ్చినా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ఉపయోగించాని తెలిపారు. నగరంలో ఉచిత కరోనా పరీక్షల సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

Tags:    

Similar News