Telangana: గిరిజన తండాల్లో వైద్య ఆరోగ్య శిబిరం
పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం లో భాగంగా మండలం లో ఉడుగుల కుంట తండా లో గురువారం నాడు నిర్వహించిన వైద్య ఆరోగ్య శిబిరం విజయవంతమైనట్లు సర్పంచ్ కట్రా వత్ చందూలాల్ తెలిపారు
బిజినపల్లి: పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం లో భాగంగా మండలం లో ఉడుగుల కుంట తండా లో గురువారం నాడు నిర్వహించిన వైద్య ఆరోగ్య శిబిరం విజయవంతమైనట్లు సర్పంచ్ కట్రా వత్ చందూలాల్ తెలిపారు. లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అంబటి అనిల్ జోసెఫ్ మరియు వారు వైద్య సిబ్బంది తో తండా వాసులకు వివిధ రకాల వైద్య ఆరోగ్య పరీక్షలు ,సాధారణ పరీక్షలు నిర్వహించి తాండ గిరిజనులకు మందులు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ కాలానుగుణంగా దొరికే పండ్లను,అధికంగా తినాలి అని ఆయన సూచించారు.తండ నుండి దగ్గరలోని ఆసుపత్రి కి వెళ్ళుటకు రవాణా కు ఉచితంగా 102,108, అంబులెన్స్ వాహన సేవలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.నవజాత శిశువులకు, గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు సైతం దగ్గర్లోని ఆసుపత్రికి చేరుటకు 102 వాహనం ప్రతి బుధవారం శనివారం ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హుణ్య నాయక్ గ్రామ ప్రత్యేక అధికారి టి.యాదగిరి,పంచాయతీ కార్యదర్శి బీ నరసింహ ఆరోగ్య పర్యవేక్షకులు కిష్టమ్మ,మహిళా ఆరోగ్య కార్యకర్తలు హెలెన్, విజయలక్ష్మి ఆశా కార్యకర్తలు విజయమ్మ,లక్ష్మి, తాండ వార్డు సభ్యులు,గిరిజనులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.