Raghunandan Rao: భవిష్యత్ తరాల కోసం అమృత్ 2.0 రూపొందించాం

Amrut 2.0 Scheme Medak: భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని అమృత్ 2.0 పథకాన్ని రూపొందించామని మెదక్ ఎంపీ రఘునందన్‌‎రావు తెలిపారు.

Update: 2025-10-10 06:38 GMT

Raghunandan Rao: భవిష్యత్ తరాల కోసం అమృత్ 2.0 రూపొందించాం 

Amrut 2.0 Scheme Medak: భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని అమృత్ 2.0 పథకాన్ని రూపొందించామని మెదక్ ఎంపీ రఘునందన్‌‎రావు తెలిపారు. మెదక్ జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ పథకం నిర్మాణ పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు.

అమృత్ 2.0 పథకం ద్వారా జిల్లాలోని వివిధ వార్డులలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 2.0 ద్వారా పట్టణంలో 32 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సబ్ స్టేషన్ మునిగిపోయిందని... దీంతో జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపేయడం జరిగిందన్నారు. సబ్ స్టేషన్ కోసం నిధులు మంజూరు అవడంతో త్వరలో నిర్మాణ పనులు మొదలవుతాయని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News