మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు
* మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో చేరిన ప్రజాప్రతినిధులు
మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు
Indrakaran Reddy: మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీలో చేరారు. ఈనెల 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ ఉండడంతో మంత్రి ఇంద్రకరణ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మేరకు బోకర్ మండలం రాఠీ సర్పంచ్ సహా 100మందిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే బీఆర్ఎస్ వచ్చిందని మంత్రి తెలిపారు.