చొప్పదండి: మండలం లోని 16 గ్రామాలలో లో కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ వారు అందించినటువంటి మాస్క్ లను... టీఆర్ఎస్ మండల నాయకుడు గడ్డం చుక్క రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కరోనా వైరస్ నివారణ కోసం అందరూ సామాజిక దూరం పాటించి, మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.