తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో వేర్వేరు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి.

Update: 2022-01-18 10:42 GMT

తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో వేర్వేరు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 10 మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్కా జిల్లా మార్జుమ్‌ అటవీ ప్రాంతం టోంగ్‌పాల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కాల్పులు జరిగాయి. మావోయిస్టు ప్లీనరీ జరుగుతుందన్న పక్కా సమచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది.

మరోవైపు తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఓ జవాన్‌కు గాయాలు అయ్యాయి. దీంతో గాయపడ్డ జవాన్‌ మధును ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహాదేవ్‌పూర్‌ ఏరియా కమిటీ దళ కమాండర్‌ సుధాకర్‌ ఉ‍న్నట్లు సమాచారం.

Tags:    

Similar News