Manikrao Thakre: అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి.. రేవంత్‌రెడ్డి 50 నియోజక వర్గాలకు..
Manikrao Thakre: టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
Manikrao Thakre: అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి.. రేవంత్‌రెడ్డి 50 నియోజక వర్గాలకు..
Manikrao Thakre: టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరికి అనుకూలం వ్యతిరేకంగా కాదన్నారు. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి అని తెలిపారు. నేతలంతా ఐక్యంగా హాత్ సే హాత్ యాత్ర చేయాలని సూచించారు. రేవంత్‌రెడ్డి 50 నియోజక వర్గాలకు తగ్గకుండా యాత్ర చేస్తారని చెప్పారు. మిగిలిన సీనియర్లు 20, 30 నియోజకవర్గాల్లో యాత్ర చేస్తారని అన్నారు. ఐక్యంగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని థాక్రే ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దని ఎవరైనా తనతో ఫోన్‌లో మాట్లాడాలని థాక్రే సూచించారు.