Karimnagar: రోడ్డు భద్రతా నియమాలను పాటించటం తప్పనిసరి

ప్రయాణికులు రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాల నుండి తప్పించుకోవాలని ఏసిపి విజయసారథి అన్నారు.

Update: 2020-01-10 09:49 GMT

కరీంనగర్ రూరల్: ప్రయాణికులు రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాల నుండి తప్పించుకోవాలని ఏసిపి విజయసారథి అన్నారు. రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలోని అభినవ పాఠశాల స్థలంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏసిపి విజయసారథి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ప్రయాణికుడు విధిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అన్నారు.

శక్తికి మించిన లోడుతో వాహనాలపై ప్రయాణం చేయకూడదని వాహనాలకు సంబంధించిన పత్రాలు అన్నింటినీ వాహనాల వెంట ఉంచుకోవాలని సూచించారు. వాహనాలు నడిపే వ్యక్తులు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని, అప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యం అవుతుందని అన్నారు. ప్రమాదాల నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసినప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని తెలిపారు.

ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమాలపై పోలీస్ కళాబృందం పాటల రూపంలో చేపట్టిన కార్యక్రమం పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చొప్పదండి సీఐ రమేష్, ఎస్సై గొల్లపల్లి అనూష, సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న రెడ్డి, ఉప సర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ ఎడవెల్లి కరుణశ్రీ, నరేందర్ రెడ్డి, వాహనాల డ్రైవర్లు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News