వరంగల్ జిల్లాలో చేతబడి కలకలం.. ఉదయం లేచి చూస్తే మనిషి అదృశ్యం!
Warangal: వరంగల్ రూరల్ జిల్లాలో చేతబడి కలకలం రేగింది.
వరంగల్ జిల్లాలో చేతబడి కలకలం.. ఉదయం లేచి చూస్తే మనిషి అదృశ్యం!
Warangal: వరంగల్ రూరల్ జిల్లాలో చేతబడి కలకలం రేగింది. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. రాత్రి ఇంటి బయట మంచంపై పడుకున్న సతీష్ తెల్లారేసరికి కనిపించకుండాపోయాడు. మంచం పక్కన మనిషి బొమ్మ, మిరపకాయలు, నిమ్మకాయలు ఉండడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారమివ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదృశ్యమైన యువకుడు సతీష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. చేతబడి చేసి సతీష్ ఏం చేసి ఉంటారోనని అతని భార్య, తల్లి, బంధువులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే తరహాలో ఒక వ్యక్తి అదృశ్యమైనా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.