కేసీఆర్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన యువకుడు..గన్ పార్క్ వద్ద అలజడి

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరారు.

Update: 2020-06-02 05:31 GMT

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరారు. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు కాన్వాయ్ వైపు దూసుకొచ్చ సీఎం కారు డోర్ దగ్గరకు వెళ్లాడు. అది గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమైన ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించిన పోలీసులు నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లికి చెందిన హనుమంతు నాయక్‌గా గుర్తించారు. డబుల్ బెడ్రూం ఇల్లు కోసం అతను సీఎం కాన్వాయ్‌కు అడ్డుతగిలానని అతడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. భద్రతా దళాలు పహారా కాస్తున్నా, పోలీసులు చుట్టుముట్టి ఉన్నా కళ్లుగప్పి హనుమంతు నాయక్ కేసీఆర్ కాన్వాయ్‌కు అడ్డు తగలడం గమనార్హం. ఈ సంఘటనతో సీఎం భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేటికి ఆరు ఏండ్లు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెట్టింది. ఏడో ఆవిర్భావ దినోత్సవాన్నిపురస్కరించుకుని అసెంబ్లీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత శాసనసభ వద్ద పోచారం, శాసనమండలి వద్ద గుత్తా జాతీయ పతకాన్ని ఎగురవేశారు.

అనంతరం ప్రగతి భవన్‌ నుంచి గన్‌పార్క్‌ చేరుకున్న ఆయన అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అమరవీరులకు నివాళులు అర్పించారు. 


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News