సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై సోషల్ మీడయాలో తప్పుడు ప్రచారం, వ్యక్తి అరెస్ట్‌

Man held for spreading false news on KCR health: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్‌ మీడియలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Update: 2020-08-19 07:26 GMT

Man held for spreading false news on KCR health: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్‌ మీడియలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దుబాయ్‌లో ఉంటున్న జగిత్యాలకు చెందిన రాజు అనే యువకుడు కేసీఆర్ కరోనాతో చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో రాజుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన రాజును ముంబై ఏయిర్ పోర్ట్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు రాజును ముంబై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ కేసులో అతన్ని పోలీసులు జ్యుడీషియల్‌ కస్టడికి పంపారు.



 


Tags:    

Similar News