నేడు మహబూబ్‌నగర్ మున్సిపల్‌ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

Mahbubnagar: గత నెల 27న అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నేడు ఎన్నిక

Update: 2024-02-12 03:34 GMT

నేడు మహబూబ్‌నగర్ మున్సిపల్‌ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

Mahbubnagar: తెలంగాణలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత క్షేత్రస్థాయిలో పొలిటికల్ సీన్స్ మారుతున్నాయి. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు అట్టుడుకుతున్నాయి. గత నెల 27న మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం నెగ్గింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లను, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లను కలుపుకుని, కాంగ్రెస్ అవిశ్వాస ప్రక్రియలో విజయం సాధించింది.

ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక జరగనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇవాళ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ల ఎంపిక జరగనుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఛైర్మన్ పదవి, ఎంఐఎం పార్టీకి వైస్ ఛైర్మన్ పదవులు దక్కే అవకాశం ఉంది. మొత్తం 49 మంది కౌన్సిలర్లలో మెజారిటీ స్థానాలను దక్కించుకుని గత నాలుగేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని ఏలుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పురపాలికలో పరిణామాలు వేగంగా మారాయి.

Tags:    

Similar News