CI Madhusudhan: పెద్ద మ‌న‌సు చాటుకున్న పోలీస్ సారూ

CI Madhusudhan: లాక్‌డౌన్ కారణంగా కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో ఇబ్బందులు పడుతున్న గర్భిణి పట్ల కామారెడ్డి సీఐ మానవత్వాన్ని చాటుకున్నారు.

Update: 2021-05-12 11:44 GMT

Lockdown: పెద్ద మ‌న‌సు చాటుకున్న పోలీస్ సారూ

CI Madhusudhan: లాక్‌డౌన్ కారణంగా కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో ఇబ్బందులు పడుతున్న గర్భిణి పట్ల కామారెడ్డి సీఐ మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లా బస్టాండ్ ఆవరణలో ఇబ్బంది పడుతున్న గర్భిణికి పట్టణ సీఐ మధుసూదన్ సహాయం అందించారు. గర్భిణిని సురక్షితంగా స్వగ్రామానికి పంపించారు. లాక్‌డౌన్ విషయం తెలియక పోవడంతో గర్భిణీ మహేశ్వరి ఈ ఉదయం పరీక్షల నిమిత్తం స్వగ్రామం చిన్న పొతంగల్ నుంచి కామారెడ్డికి వచ్చింది. పరీక్షలు అనంతరం స్వగ్రామం చిన్న పొతంగల్ వెళ్లేందుకు బస్టాండ్ చేరుకోగా అప్పటికే లాక్‌డౌన్ ప్రారంభమైంది. స్వగ్రామం వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న గర్భిణి మహేశ్వరిని సీఐ మధుసూదన్ డీసీఎంలో స్వగ్రామం పంపించారు.

Tags:    

Similar News