Revanth Reddy: జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు
Revanth Reddy: లోకసభ ఎన్నికల్లో క్షేత్రస్థాయి నేతల పనితీరుపై అవకాశాలు
Revanth Reddy: జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు
Revanth Reddy: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయి నేతల పనితీరును బట్టి ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో జరిగిన భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేంలో సీఎం మాట్లాడారు.. బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు మూడంచెల సమన్వయ కమిటీల వ్యవస్థను త్వరితగతిన ఏర్పాటు చేసుకుని సమష్టిగా పని చేయాలన్నారు.
ఇటు డీసీసీ అధ్యక్షులు, అటు మండల, బూత్ స్థాయి కమిటీలూ సమన్వయం చేసుకుని పోల్ మేనేజ్‌మెంట్ పకడ్బందీగా నిర్వహించాలని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమన్వయకర్తలకు సూచించారు. ప్రతి పది బూత్‌లను కలిసి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలని, వంద రోజుల్లో ప్రభుత్వ పనితీరును, రాహుల్‌గాంధీ ప్రకటించిన పాంచ్ న్యాయ్ గ్యారెంటీలను, పార్టీ మేనిఫెస్టోను ప్రతి ఓటరు వద్దకూ వెళ్లి వివరించాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బూత్ కమిటీల్లో చురుకుగా పనిచేసిన వారికి గ్రామ వాలంటీర్ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మందికి పైగా వాలంటీర్లతో వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇందులో మహిళలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తామని, 6 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని సీఎం చెప్పారు.