Live Fish in Nizamabad: లైవ్ ఫిష్..రుచిలో బెస్ట్ !

Update: 2020-07-24 06:21 GMT

Live Fish in Nizamabad: తింటే గ్యారలే తినాలనే రోజులు పోయాయి. తింటే చేపల కూర తినాలనే రోజులచ్చాయి. అసలే కరోనా కాలం శరీరానికి కావాల్సిన విటమిన్స్ చేపల్లో పుష్కలంగా ఉంటాయి. దీనికి తోడు అదిరిపోయే టెస్ట్.. ఇంకేముంది మాంసపుప్రియులు చేపల కోసం ఎగబడుతున్నారు. అయితే చాలా మంది లైవ్ చేపలు కొనాలని ఆశపడుతుంటారు. కానీ లైవ్ చేపలు దొరకాలంటే ఓ చెరువు వద్దకో నది వద్దకో వెళ్లాలి. కానీ నిజాబామాద్ చేపల మార్కెట్ లో ఓ వ్యాపారి మాత్రం లైవ్ చేపలు విక్రయిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. వినూత్నంగా ఆలోచించి సరికొత్తగా వ్యాపారం చేస్తున్నాడు.

చిట్టి చిట్టి నోళ్లు తెరిచి స్వేచ్ఛగా ఈత కొడుతున్న ఈ చేపలు ఎక్కడో చెరువు దగ్గర అనుకుంటున్నారా కాదు నిజామాబాద్ ఫిష్ మార్కెట్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. హ్యాపీగా ఈత కొడుతూ హాయ్ గా జంప్ చేస్తూ కొనుగోలుదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి కదూ. చాలా మంది వినియోగదారులు లైవ్ చేపలనే లైక్ చేస్తున్నారు. అందుకే రాజు అనే చేపల వ్యాపారి చెరువుల్లో పట్టిన ప్రతి చేపను ప్రాణాలతో వినియోగదారులకు అందించాలని సంకల్పించాడు. అన్నకున్నదే తడవుగా అందుకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకున్నాడు. ప్రత్యేకమైన బాక్స్ లు, ఆక్సిజన్ సిలెండర్ ఏర్పాటు చేశాడు. ఫలితంగా బాక్సులో చేపలన్నీ ప్రాణాలతోనే ఉంటున్నాయి.

నిజామాబాద్ ఫిష్ మార్కెట్ లో రాజు దగ్గరనే లైవ్ ఫిష్ లభిస్తాయి. అయితే చేపలను ప్రాణాలతోనే మార్కెట్ కు తీసుకురావడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకని లైవ్ చేపలను రూ. 20 అధిక ధరకు విక్రయిస్తున్నాడు. అయినా చేపలు టేస్ట్ గా ఉండడంతో లైవ్ చేపలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా వేళ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలెండర్లు లేక వైరస్ బాధితులు పిట్టల్లా రాలుతుంటే ఈ వ్యాపారి మాత్రం చేపపిల్లలను కాపాడానికి ఆక్సిజన్ సిలెండర్లను వినియోగిస్తున్నాడు. ఏదీఏమైనా లైవ్ ఫిష్ దొరుకుతుండడంతో మాంసపుప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News