మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. రాష్ట్రంలో తగ్గిన ధరలు.. నేటి నుంచే అమల్లోకి..

మందుబాబులకు శుభవార్త.. తెలంగాణలో తగ్గిన మద్యం ధరలు

Update: 2023-05-05 16:28 GMT

మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. రాష్ట్రంలో తగ్గిన ధరలు. నేటి నుంచే అమల్లోకి..

Liquor Prices: మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం కిక్కిచ్చే న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీర్‌ మినహాయించి ఇతర అన్ని బ్రాండ్‌లకు సంబంధించిన లిక్కర్‌పై ధరలు తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.

 ఫుల్ బాటిల్ పై రూ.40లు, హాఫ్ బాటిల్ పై రూ.20లు, క్వార్టర్ బాటిల్ పై రూ.10ల చొప్పున ధరలు తగ్గినట్లు సర్కార్ వెల్లడించింది.కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్ పైన రూ.60ల వరకూ ధరలు(Liquor Rates) తగ్గించినట్లుగా ఆబ్కారీ అధికారులు తెలిపారు. తగ్గిన ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. 

Tags:    

Similar News