Leopard Hulchal in Rajendernagar: రాజేంద్రనగర్ లో మళ్ళీ కలకలం రేపుతున్న చిరుత సంచారం..

Leopard Hulchal in Rajendernagar: రాజేంద్రనగర్ లో మళ్ళీ కలకలం రేపుతున్న చిరుత సంచారం..

Update: 2020-08-28 05:08 GMT

Leopard (File Photo)

Leopard Hulchal in Rajendernagar: రాజేంద్రనగర్ లో మళ్ళీ కలకలం రేపుతున్న చిరుత సంచారం. చిరుత కదలికలు ఆనవాళ్ళు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యియి. గతంలో చిరుత సంచారం నేపధ్యంలో అటవీశాఖ అధికారులు 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. చనిపోయిన దూడ మృతదేహాన్ని కొంతదూరం లకెళ్లిన చిరుత విజువల్స్ కెమెరాలో రికార్డు ఐయ్యాయి.  దానికి సంబంధించి సీసీ ఫుటేజీ బయటకి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నఅధికారులు, చిరుతను పట్టుకోవడానికి బోన్ ఏర్పాటు చేసారని సమాచారం. ఈ ఘటనపై రాజేంద్రనగర్ ప్రజలు భయాందోళనతో ఉన్నారు.

ఐతే సీసీ ఫుటేజీ బయటకి పొక్కకుండా జాగ్రత్త పడుతున్న అధికారులు చిరుతను పట్టుకోవడానికి బోన్ ఏర్పాటు చేసారని సమాచారం. ఈ ఘటనపై రాజేంద్రనగర్ ప్రజలు భయాందోళనతో ఉన్నారు. నిర్మాణుష్యమైన అటవీ ప్రాంతాన్ని వదిలేసి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసం పాకల్లో ఉన్న పశువులను బలి తీసుకుంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక అటవీ శాక అదికారులు వాటిని పట్టుకుందామని ప్రయత్నం చేసే లోపే అవి చిక్కినట్టే చిక్కి అక్కడి నుంచి జారుకుంటున్నాయి. మళ్లీ ఎప్పుడో కొన్ని రోజుల తరువాత కనిపిస్తున్నాయి.

ఇక ఈ చిరుత కొద్ది రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ రైల్వే అండర్‌పాస్‌ వద్ద ఉదయం 6 గంటల సమయంలో రోడ్డుపై కనిపింది. అటవీ అధికారులు దాన్ని పట్టకుంటామనే లోపే అది ఓ డ్రైవర్ పై దాడి చేసి అక్కడి నుంచి పక్కనే ఉన్న ఓ తోటలోకి పారిపోయింది. అప్పటి నుంచి ఆ చిరుత వ్యవసాయ యూనివర్సిటీ, పోలీస్‌ అకాడమీ పరిసరాల్లో తిరుగుతున్నది. సరిగ్గా రెండు రోజుల తరువాత అంటే మే 16న హిమాయత్‌ సాగర్‌ వద్ద నీళ్లు తాగుతుండగా స్థానికుగు గుర్తించారు. ఆ తరువాత అధికారులకు సమాచారం అందించారు. మళ్లీ జూన్‌ 3వ తేదీన వ్యవసాయ వర్సిటీ ఆరణలో తిరిగినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నం చెసరు. కానీ చిరుత దొరకలేదు. ఇక ఇదే విధంగా రాష్ట్రంలో మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో కూడా చిరుతలు సంచరిస్తున్నాయి. ఆకలి మంటకు రాత్రి వేలల్లో పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి.

Tags:    

Similar News