Nizamabad: సిరికొండలో చిరుత కలకలం
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం రేపింది.
Nizamabad: సిరికొండలో చిరుత కలకలం
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. సిరికొండ రేంజ్ పరిధిలోని తిరుపతిగుట్ట అటవీ ప్రాంతంలో లేగదూడపై చిరుత దాడి చేసి చంపిందని ఇన్ఛార్జి రేంజర్ రవీందర్ తెలిపారు. గోప్యానాయక్ తండాకు చెందిన మలావత్ రఘుపతికి చెందిన లేగదూడ అటవీప్రాంతంలో మేతకు వెళ్లి మృతిచెందడంతో అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. పశువులపై అటవీ జంతువులు దాడి చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఇన్ఛార్జి రేంజర్ రవీందర్ కోరారు.