Karimnagar: కరీంనగర్ జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ సస్పెండ్

Karimnagar: దళిత మహిళని కావడం వల్లే సస్పెండ్ చేశారు అంటూ సర్పంచ్ * వైకుంఠ ధామ నిర్మాణం చేపట్టిన సర్పంచ్, గ్రామస్తులు

Update: 2021-09-14 08:50 GMT

కరీంనగర్ జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ సస్పెండ్(ఫోటో-ది హన్స్ ఇండియా)

Karimnagar: ఆ గ్రామంలో అభివృద్ధి కోసం పనిచేసే దళిత మహిళ సర్పంచ్‌కు నిత్యం వేధింపులో గ్రామంలో వైకుంఠ థామం కోసం ఇప్పటికే 8 లక్షలు ఖర్చు పెట్టి సగం పని పూర్తి చేశారు. అయితే నిర్మాణ పనులు ఆపాలని పలువురు రైతులు హైకోర్టులో స్టే తీసుకువచ్చారు. దీంతో స్టే వెకేట్ కోసం గ్రామస్తులు హైకోర్టులో అప్పీల్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని లక్షీదేవి పల్లి గ్రామంలో నిత్యం అధికారుల వేధింపులతో సర్పంచ్, పాలకవర్గం, గ్రామస్తులు సతమతం అవుతున్నారు.

ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో గెలిచిన ఓ మహిళా సర్పంచ్‌ని నిత్యం వేధిస్తూ అవమానాలకు గురిచేస్తున్నారు. చొప్పదిండి ఎమ్మెల్యే రవిశంకర్ బంధువులపై పోటీ చేసినందుకే తనని సస్పెండ్ చేయించడమే కాకుండా నిత్యం వేధిస్తున్నారని ఎస్సీ మహిళా సర్పంచ్ అయిన తాళ్ల విజయలక్ష్మి వాపోతున్నారు. లక్ష్మిదేవిపల్లి గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణం కోసం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి గ్రామ సభ పెట్టారు. సర్వే నంబర్ 189లో సుమారు 40 కుంటల భూమిలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సర్వే నంబర్ ప్రక్కన ఉన్న కొంత మంది రైతులు ఆ గ్రామ పెద్ద మనుషుల సహకారంతో అడ్డుకుంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే ప్రొద్భలంతో ఆ ముగ్గురు రైతులకే మద్దతు తెలుపుతున్నారని సర్పంచ్ వాపోతున్నారు.

ఇదిలా ఉంటే సర్వే 189 లో కాకుండా ఎమ్మెల్యే రవిశంకర్ సూచనలతో గ్రామంలోని సర్వే నంబర్ 267లో స్మశాన వాటిక నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీంతో అధికారులు సర్వే చేయడానికి గ్రామానికి రాగా వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక వైకుంఠ ధామ నిర్మాణాన్ని కారణంగా చూపిస్తూ కలెక్టర్ తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని, గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే రవికుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags:    

Similar News