హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

Update: 2019-10-11 13:51 GMT

హైదరాబాద్‌ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.. ఉరుములతో కూడిన వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి..సికింద్రాబాదులోని ప్యాట్నీ, ప్యారడైస్, చిలకలగూడ, పద్మారావు నగర్ సంగీత్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది..గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్డుపై ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీరు రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి..ఆకాశమంత మబ్బులతో కమ్ముకొని చీకట్లో కమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..

Tags:    

Similar News