పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

Petrol Rates: పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.

Update: 2023-03-30 14:00 GMT

పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

Petrol Rates: పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచేసి.. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని మండిపడ్డారు. ముడిచమురు ధరలు తగ్గినా.. దేశంలో పెట్రోల్‌ ధరలు తగ్గడం లేదని అన్నారు. పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని.. మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మరోసారి రుజువైందన్నారు. మోడీ తన కార్పొరేట్‌ మిత్రుల ఖజనాను లాభాలతో నింపేందుకే ధరల పెంపు అంటూ ఆరోపించారు. ధరల భారంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని లేఖలో తెలిపారు మంత్రి కేటీఆర్.

Tags:    

Similar News