బిజినెస్‌, బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం.. స‌త్య నాదెళ్ల‌ను క‌లిసిన మంత్రి కేటీఆర్‌..

KTR: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను కలిసిన మంత్రి కేటీఆర్‌

Update: 2023-01-06 08:47 GMT

KTR: బిజినెస్‌ అండ్‌ బిర్యానీ గురించి మాట్లాడామని కేటీఆర్‌ ట్వీట్

KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌ను క‌లిశారు. ఇద్ద‌రు హైద‌రాబాదీలు క‌ల‌వ‌డం శుభ‌దినం అవుతుంద‌ని మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. స‌త్య నాదెళ్ల‌తో బిజినెస్‌ అండ్‌ బిర్యానీ గురించి చ‌ర్చించిన‌ట్లు కూడా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌లో తెలిపారు. బెంగళూరులో జరిగిన ఫ్యూచర్‌ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో చాట్‌ జీపీటీ అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఛాట్‌ రోబోను నాదెళ్ల పరిచయం చేశారు. పాపులర్‌ సౌత్‌ ఇండియన్‌ టిఫిన్స్‌ ఏముంటాయని చాట్‌ రోబోను ప్రశ్నించగా ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ రోబో సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల బిర్యానీని సౌత్‌ ఇండియా టిఫిన్‌ అని అవమానించొద్దన్నారు. దీంతో వెంటనే చాట్‌ రోబో క్షమాపణ చెప్పింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ బిజినెస్‌ అండ్‌ బిర్యానీపై చర్చించామని ట్వీట్‌ చేయడం నెటిజన్లకు ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News