ఆన్‌లైన్ హోమ్ డెలివరీపై కేటీఆర్ ట్వీట్...

కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ వైరస్ ఇప్పటి వకరూ 150కి పైగా దేశాలలో వ్యాపించింది.

Update: 2020-03-25 07:55 GMT
KTR

కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ వైరస్ ఇప్పటి వకరూ 150కి పైగా దేశాలలో వ్యాపించింది.అందులో మన భారత దేశం కూడా ఉందన్న విషయం తెలిసిందే. రోజు రోజుకు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చింది. ఏప్రిల్ 14 వరకూ దేశం మొత్తం లాక్ డౌన్ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపిచ్చారు.

ఇటలీలో వైరస్ వ్యాప్త చేసినపుడు దాన్ని కట్టడి చేయడానికి ఇదే విధంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ప్రజలు ఇండ్లకే పరిమితమై వైరస్ ను తమ దేశం నుంచి తరిమికొట్టగలిగారు. నిత్యవసర వస్తువులు, అత్యవసర వస్తువుల కోసం ఇటలీలో ప్రజలంతా ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలోనే కొనుక్కున్నారు. అందుకే వారు ఇండ్ల నుంచి బయటికి రాకుండా ఉన్నారు. కానీ భారత దేశంలో మాత్రం లాక్ డౌన్ పేరుతో... ఈ-కామర్స్ సైట్లు హోం డెలివరీ ఎక్కడికక్కడ ఆపేశాయి. దీంతో నగర ప్రజలంతా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావలసిన అవసరం వస్తుంది.

దీంతో చాలా మంది నెటిజన్లు ఇలాగైతే ఎలా అని తన ఆవేదనను వ్యక్తం చేసారు. అందులో ఓ యువకుడు తన ఆవేదనను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. అది చదివిన కేటీఆర్ స్పందించి ఆ యువకుడికి రిప్లై ఇచ్చారు. ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్, హోం డెలివరీలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్, అమెజాన్ లాంటి సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించేలా తన ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్నారు. ఒకట్రెండు రోజుల్లో... ఆన్‌లైన్‌లోనే నిత్యవసరాలు కొనుక్కునే ఛాన్స్ రావచ్చంటున్నారు.

అప్పటి వరకూ అత్యవసరం, నిత్యవసరం వంటివి తెచ్చుకోవచ్చని తెలిపారు. కానీ సమీపంలో ఉన్న దుకాణాలకు వెల్లి త్వరగా ఇంటికి తిరిగి రావాలని తెలిపారు. ప్రతి సారి దుకాణాలకు పరుగులు పెట్టడం కాకుండా ఒకే ఓ వారానికి సరిపడా తెచ్చేసుకుంటే బాగుంటుందని తెలిపారు. ఈ 21 రోజులూ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పినట్లు నడచుకుంటే ఇండియా నుంచీ కరోనాని తరిమేయొచ్చన్నారు.



Tags:    

Similar News