'ఎందుకు పాల్గొనలేదు'- కేటీఆర్‌... 'పిలిస్తే కదా వచ్చేది'- ఈటల..

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ హాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

Update: 2023-02-03 10:05 GMT

‘ఎందుకు పాల్గొనలేదు’- కేటీఆర్‌... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల..

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ హాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. గవర్నర్ స్పీచ్‌కు ముందు మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడారు కేటీఆర్. హుజురాబాద్‌లో అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదని.. ఈటలను కేటీఆర్ ప్రశ్నించారు. పిలిస్తే కదా హాజరయ్యేదంటూ ఈటల సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే విధానం సరిగాలేదని ఈటల చెప్పారు. ఈటల, కేటీఆర్ సంభాషణ మధ్యలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎంట్రీ ఇచ్చారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలవలేదని ప్రస్తావించారు భట్టి. అంతకుముందు ఈటలతో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు.

Tags:    

Similar News