KTR: మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తాం
KTR: మహిళా పారిశ్రామిక వేత్తలకు కేటీఆర్ హామీ
KTR: మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తాం
KTR: తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా WE HUB 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.WE HUB ప్రతినిధులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. స్త్రీ, పురుషులకు సమానంగానే ప్రతిభ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళలు వ్యాపారంగంలో రాణించడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తామన్నారు.