KTR on TRS Party: తెలంగాణకు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసిఆర్: కేటీఆర్

KTR on TRS Party: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశం.

Update: 2020-08-01 07:12 GMT
KTR (File Photo)

KTR on TRS Party: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో తెలంగాణకు కర్త,కర్మ,క్రియ అన్నీ కేసిఆర్ అనీ.. వంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పార్టీ నిర్మాణం జరుగుతోంది.. అని కేటీఆర్ మాట్లాడారు. అయన ఇంకా ఏమ్మన్నారో ఆయన మాటల్లోనే..

♦ తెలంగాణకు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసిఆర్.

♦ వంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పార్టీ నిర్మాణం జరుగుతోంది.

♦ 20 ఏళ్లలో పార్టి ఎన్నో ఓడి దుడుకులు ఎదుర్కొంది.

♦ జలదృశ్యం నుంచి గెంటి వేయబడ్డ పార్టీ మనది.

♦ కార్యకర్తల శ్రమ,పట్టుదల కారణం గానే ఈ స్థాయికి వచ్చింది.

♦ కార్యకర్తలను ఆదుకునే స్థాయికి టిఆర్ ఎస్ వచ్చింది.

♦ 16 కోట్ల 11 లక్షల ప్రీమియం మొత్తంగా బీమా కంపెనీ కి చెల్లించాము.

♦ తెలంగాణ సాధించే వరకు ఎన్నో అటు పోట్లతో ఈ స్థాయికి చేరుకుంది.

♦ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అని ధైర్యం నింపిన నేత కెసిఆర్.

♦ 13 ఏళ్ళు ఎన్నో కుట్రలు ఎదుర్కొన్నాం.

♦ స్వీయ రాష్ట్ర ఆస్తిత్వమే మనకు రక్ష అని జయశంకర్ సర్ ఎన్నో సార్లు చెప్పారు.

♦ రాష్ట్రం బహుముఖాభివృద్ది మా లక్ష్యం.

♦ పార్టీ కార్యకర్తల శ్రమ, పట్టుదల మాములు త్యాగాలు కావు.

♦ కెసిఆర్ స్థాపించిన ముహూర్త బలం మరో వందేళ్లు పార్టీ బలంగా ఉండేలా ఉంది.

♦ కార్య కర్తల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టే యోచన లో ఉన్నాం.

♦ టిఆర్ ఎస్ దేశంలో అజేయ మైన శక్తిగా ఎదిగింది.

♦ టిఆర్ ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి గా మారింది.

♦ పార్టీ కార్యకర్తలను ఆదుకునే చర్యలు ఎమ్మెల్యేలు చేపట్టాలి.

♦ వారి ఇళ్లకు వెళ్లి సమస్యలు పార్టీ దృష్టికి తీసుకురండి.

♦ త్వరలో జిల్లా కార్యాలయాలు ప్రారంభిస్తాం.

♦ కరోనా కారణంగా కార్యకర్తల శిక్షణ వాయిదా వేసుకున్నాం.

♦ ప్రజలకు, ప్రభుత్వానికి అనుసందానంగా కార్యకర్తలు ఉండాలి.

♦ కరోనలో ప్రజలను ఆదుకునే చర్యలు తీసుకోవాలి.

♦ ప్రభుత్వ పరంగ ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం.

♦ నేతలు శాయా శక్తుల మేరకు ప్రజలను ఆదుకోవాలి.

♦ వ్యక్తిగతంగా సహాయం చేయాలనే నా పుట్టిన రోజు సందర్భంగా అంబులెన్సు లు ఇచ్చాం.

♦ కరొనా సంక్షోభం ముగిసే వరకు ప్రజలకు సేవలు అందించాలి.

♦ కాంగ్రెస్, బీజేపీ నేతలు పదవులు దక్కడం టిఆర్ఎస్ పుణ్యమే.

♦ కెసిఆర్ మీద మాట తులే ముందు గుర్తించుకోవాలి.

Tags:    

Similar News