KTR: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

KTR: కేటీఆర్‌కు స్వాగతం పలికిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్

Update: 2023-06-07 06:53 GMT

KTR: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

KTR: ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్‌తో పాటు ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ బిల్లింగ్, ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకరరావు , సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, డీజీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.

134 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. 68 కోట్లతో నిర్మించే సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయానికి భూమి పూజ చేశారు. కోటి 25 లక్షలతో నిర్మించే మోడల్ బస్ స్టేషన్, 50 లక్షలతో నిర్మించే సేవాదళ్ భవన్‌కు కేటీఆర్ శ్రీకారం చుట్టారు.

ములుగు జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత రామప్ప చెరువులో గోదావరి జలాలకు పూజలు చేయనున్నారు. అనంతరం ములుగులో బీఆర్ఎస్ పార్టీ బహిరంగసభలో కేటీఆర్, మంత్రుల బృందం పాల్గొననుంది.  

Tags:    

Similar News