KTR: గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవు.. దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
KTR: గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.
KTR: గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవు.. దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
KTR: గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కేవలం 4లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందని తెలిపారు. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామని చెప్పారు. కార్యకర్తలు కష్టపడితే మల్కాజిగిరిలో ఈసారి విజయం బీఆర్ఎస్‌దేనన్నారు. మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.