బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా: కేటీఆర్

Update: 2021-03-05 11:16 GMT

బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా: కేటీఆర్

సీఐఐ సదస్సు వేదికగా కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆరున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టూ ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులపై ఇప్పటి వరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలు పర్చలేకపోయారన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా గొప్ప నినాదాలని, ప్రధాని టీమ్ ఇండియా అంటూ గొప్పగా చెబుతుంటారని కానీ ఆచరణలో అవి కనిపించవన్నారు.

భారత్‌లో అందుబాటులోకి రానున్న బుల్లెట్ ట్రైన్స్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ ఒక్క రాజకీయ నేత అయినా ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పని చేయాలని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News