KTR: రేవంత్ కాంగ్రెస్‌కు ఏక్‌నాథ్ షిండేగా మారుతాడు

KTR: కరెంట్ బిల్లులు సోనియా ఇంటికి పంపించాలి

Update: 2024-01-20 07:55 GMT

KTR: రేవంత్ కాంగ్రెస్‌కు ఏక్‌నాథ్ షిండేగా మారుతాడు

KTR: సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రక్తం అంతా బీజేపీదేనని.. రేవంత్... కాంగ్రెస్‌కు ఏక్‌నాథ్ షిండేగా మారుతాడని హాట్ కామెంట్స్ చేశారు. అదానీ, రేవంత్ ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలన్న కేటీఆర్.. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ఎవరూ కట్టొద్దన్నారు. గృహ జ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దన్న కేటీఆర్.. సోనియా గాంధీ... కరెంట్ బిల్లు కడుతుందని రేవంత్ ఎన్నికలప్పుడు చెప్పాడని గుర్తు చేశారు. కరెంట్ బిల్లులు సోనియా ఇంటికి పంపించాలని ఎద్దెవా చేశారు.

Tags:    

Similar News