వచ్చే ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు సపోర్ట్ చేస్తున్నా: కొండా
Konda Vishweshwar Reddy: తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీకి అవకాశాలున్నాయని, కేసీఆర్ వ్యతిరేకులంతా ఒకే వేదిక మీదకు రావాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
వచ్చే ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు సపోర్ట్ చేస్తున్నా: కొండా
Konda Vishweshwar Reddy: తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీకి అవకాశాలున్నాయని, కేసీఆర్ వ్యతిరేకులంతా ఒకే వేదిక మీదకు రావాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒకే ప్రాంతీయ పార్టీ ఉండడంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఒకటి కంటే ఎక్కువ రిజినల్ పార్టీలుండాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తానని అందరితో చర్చలు జరపుతానని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు పార్టీలకు అతీతంగా బలపర్చాల్సిన అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.