Revanth Reddy: గన్‌పార్క్ దగ్గరకు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్
Revanth Reddy: ఛాలెంజ్ స్వీకరించి, కేటీఆర్ కూడా రావాలంటూ రేవంత్ ఆందోళన
గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Revanth Reddy: డ్రగ్స్‌పై మంత్రి కేటీఆర్, టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. వైట్ ఛాలెంజ్‌లో భాగంగా రేవంత్ గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. అంతకుముందే రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించినట్లు చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయన కూడా అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకున్నారు. కాగా.. విశ్వేశ్వర్ రెడ్డి సవాల్ స్వీకరించినట్లే మంత్రి కేటీఆర్ కూడా సవాల్ స్వీకరించి గన్‌పార్క్ దగ్గరకు రావాలని రేవంత్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అయితే.. రాహుల్ వస్తే తాను ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏ టెస్ట్ అయినా చేపించుకోవడానికి సిద్ధమన్నారు మంత్రి కేటీఆర్.