టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా
Konda Surekha: నాకు పదవులు ముఖ్యం కాదు, ఆత్మాభిమానమే ముఖ్యం
టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా
Konda Surekha: TPCC ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితోనే ఆమె రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. AICC ప్రకటించిన తాజా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈకమిటీలో తన కంటే జూనియర్లకు స్థానం కల్పించారని మండిపడ్డారు. ఇక పీసీసీ కమిటీలో తన పేరు లేకపోవడమంటే.. తనను అవమానించడమేనన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదన్న కొండా సురేఖ.. పార్టీలో ఆత్మాభిమానమే ముఖ్యమన్నారు. పార్టీ కోసం పనిచేస్తూ సామాన్య కార్యకర్తలా కొనసాగుతానని ఆమె తెలిపారు.