Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ.. ఉద్యోగులకు 15 నుండి 20శాతం IR ఇవ్వాలి

Komatireddy Venkat Reddy: ఉద్యోగులకు, పెన్షనర్ల డీఏలో తాత్సారం

Update: 2023-10-04 02:03 GMT

Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ.. ఉద్యోగులకు 15 నుండి 20శాతం IR ఇవ్వాలి 

Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల్లో ఐఆర్ ఒక్కటి ఇవ్వలేదన్నారు. మూడు నెలల క్రితమే ప్రకటించాల్సిన ఐఆర్ 5శాతం అరకొరగా ఇప్పుడు ప్రకటించడం ఉద్యోగులను అవమానించడమేనని పేర్కొన్నారు. ఉద్యోగులకు 15 నుండి 20శాతం IR ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాలసిన DA విషయంలో కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నాయకులు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని... ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికి ఆమోదయోగ్యమైన IR, PRC,DAలు ప్రకటించి అందరికి లాభం చేకూరుస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News