Komatireddy Venkat Reddy: సినిమా టికెట్ రేట్ల పెంపుతో నాకు సంబంధం లేదు
Komatireddy Venkat Reddy: నేను సినిమా ఇండస్ట్రీ విషయాలను పట్టించుకోవడం మానేశానని మంత్రి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Venkat Reddy: నేను సినిమా ఇండస్ట్రీ విషయాలను పట్టించుకోవడం మానేశానని మంత్రి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్పా సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం నిలిపివేశానని తెలిపారు.
రాజాసాబ్, చిరంజీవి సినిమాల టికెట్ ధరలు, ప్రీమియం షోలకు సంబంధించిన ఫైళ్లు తన దగ్గరకు రాలేదని, తనకు తెలియకుండానే రెండు సినిమాలకు జీవోలు వచ్చాయని స్పష్టం చేశారు. తాను సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదని, పెట్టే ఉద్దేశం కూడా లేదన్నారు.
నిప్పులాగా బతికిన తనను ఈ విధంగా మానసికంగా బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసినవాళ్లను దేవుడే శిక్షిస్తాడని అన్నారు. జిల్లా మంత్రిగా రివ్యూ సమావేశం పెడితే అధికారులు పక్కన కూర్చోవడం తప్పా అని ప్రశ్నించారు.
ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆరు సార్లు గెలిచానని గుర్తుచేశారు. వెంకట్‌రెడ్డి ఉండొద్దు అంటే ఇలా విషం ఇచ్చి చంపేయాలని వ్యాఖ్యానిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.