Raj Gopal Reddy: 'కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్‌ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది'..
Komatireddy Raj Gopal Reddy: తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు.
Raj Gopal Reddy: 'కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్‌ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది'..
Komatireddy Raj Gopal Reddy: తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా...ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రలతో సత్కరించారు. పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ పాతాళంలోకి వెళ్లిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రజలు తమ వైపే ఉన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి బలంగా పుంజుకుంటుందని, బీజేపీకి గెలుపు అంత ఈజీ కాదన్నారు. ఏ సర్వేల్లోనూ ప్రజా నాడి బయటకు రాలేదన్నారు. ఏపీలో ప్రజల నాడి సస్పెన్స్‌గా కొనసాగుతుందని తెలిపారు.