Rajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
Komatireddy Rajagopal Reddy: మూడున్నరేళ్లుగా మునుగోడు నియోజకవర్గం సమస్యలపై పోరాడుతున్నానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
Rajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
Komatireddy Rajagopal Reddy: మూడున్నరేళ్లుగా మునుగోడు నియోజకవర్గం సమస్యలపై పోరాడుతున్నానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తన త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోందన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే వ్యాపారవేత్తనని వ్యాపారం కోసం రాజకీయాలు చేసే గుణం తనది కాదన్నారు. ఈనెల 20న సీఎం కేసీఆర్ హాజరయ్యే సభలో మూడున్నరేళ్లుగా మునుగోడుకు ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారని, తనను గుండెల్లో పెట్టుకుంటారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారనే నమ్మకం తనకుందన్నారు.